పోలవరంలో భాగంగా 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం కూడా ఉందని కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రానికి 108 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాలని తెలిపింది. ఇప్పటివరకు 98 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయిందని.. విద్యుత్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. 80 మె.వా. సామర్థ్యం ఉన్న 12 యూనిట్లు నిర్మిస్తున్నట్లు ఏపీ చెప్పిందని కేంద్రం వెల్లడించింది.
ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి షెకావత్ లిఖితపూర్వక జవాబిచ్చారు. జులై 2024 నాటికి 3 యూనిట్ల నిర్మాణం పూర్తవుతాయని ఏపీ చెప్పిందన్నారు. మిగతా 9 యూనిట్లు 2026 జనవరికి పూర్తవుతాయని ఏపీ చెప్పిందని షెకావత్ తెలిపారు.
ఇదీ చదవండి: