సుదీర్ఘ విరామం తర్వాత.. గోదావరి నదిలో పాపికొండల పర్యాటక(papikondalu trip) పడవ ప్రయాణం సందడి మళ్లీ మొదలవనుంది(Boat services to Papikondalu to resume). గతంలో పలు ఘటనలు నేర్పిన పాఠంతో భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం లేని ప్రయాణం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ(ap tourism deportment on papikondalu trip) తగిన ఏర్పాట్లు చేసింది.
శుభప్రదమవుగాక..
రాజమహేంద్రవరం నుంచి పర్యాటకులను వాహనాల్లో పోశమ్మగండికి తీసుకెళ్తారు. ఆపై ప్రయాణం మొదలవుతుంది. గతంలో టికెట్ ధర రూ.750 ఉంటే.. ఇప్పుడు రూ.1,250కి పెంచారు.
- గతంలో గండిపోశమ్మ దర్శనంతో యాత్ర మొదలయ్యేది. సినీ చిత్రీకరణలు జరిగే పూడిపల్లి అందాలు.. విప్లవ వీరుడి చారిత్రక ఘట్టానికి గుర్తుగా దేవీపట్నం పోలీసుస్టేషన్, పాపికొండల సందర్శనతో ప్రయాణం ముగిసేది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు.. ఎగువ-దిగువ కాఫర్ డ్యామ్.. జల విద్యుత్తు కేంద్రం పనులు చూసే వీలుంది(Boat services to Papikondalu).
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
కచ్చులూరు బోటు ప్రమాదంతో పాపికొండల విహార యాత్ర నిలిచింది. 24 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈనెల 7 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. కొవిడ్ రెండోదశ తర్వాత.. ఈ ఏడాది అయిదు రోజులు యాత్ర సాగినా.. వరదలు అడ్డంకిగా మారాయి. వన యాత్రల సందడితో పూర్తిస్థాయిలో అనుమతులు దక్కాయి.
వెన్నంటే ఎస్కార్ట్
ఈసారి పడవల వెంట పర్యవేక్షణకు ఎస్కార్ట్ బోటును పంపుతారు. కంట్రోల్‌రూమ్, ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్లు, పడవల్లో వాకీటాకీలు అందుబాటులో ఉంచుతారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కంట్రోల్‌రూమ్‌కు చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏమన్నారు..? ఏం చేశారు..?
బేతమెటిక్ సర్వేలో ధవళేశ్వరం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేటల తొలగింపునకు రూ.272.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనులు మొదలవలేదు.
- నైపుణ్య సరంగులు, లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక, ఇతర భద్రత సామగ్రి సమకూరిస్తేనే అనుమతి ఇవ్వాలి.
నిర్దేశిత భద్రత ప్రమాణాలతో.. పోశమ్మగండి, పోచవరం నుంచి వెళ్లడానికి రెండు పర్యాటక పడవలు, 14 ప్రైవేటు బోట్లకు మాత్రమే ఇప్పటి వరకు పాపికొండల పర్యటనకు అనుమతి ఇచ్చారు.
- పడవల సామర్థ్యం పరీక్షించాలి. ఆకృతులు, ప్రమాణాలు ఉంటేనే అనుమతులు ఇవ్వాలి.
పర్యాటక, అటవీ శాఖలతోపాటు ప్రైవేటు ఆధీనంలోని జల క్రీడల, ప్రయాణికులను తరలించే పడవలు, లాంచీలు, పంట్లు 93 ఉన్నాయి. వీటిలో 46 పడవలకు సామర్థ్య పరీక్షలు పోర్టు అధికారుల పర్యవేక్షణలో పూర్తయ్యాయి.
- పాపికొండల యాత్ర ఆరంభంలో తనిఖీలు సమర్థంగా సాగేలా చూడాలి.
దేవీపట్నం పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేసి.. పరిమితికి లోబడి ఉంటేనే ప్రయాణానికి అనుమతివ్వాలని నిర్ణయించారు. లైఫ్ జాకెట్లు వేసుకున్నారా? బోటులో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారా? తనిఖీ చేసి చిత్రాలు తీయాల్సిఉంది.
- టికెట్ల విక్రయ వేళ పర్యాటకుల వివరాలు సేకరించాలి.
పర్యాటక వెబ్‌సైట్‌లో టికెట్లు రిజర్వు చేసుకునే వీలుంది. ఆధార్, చరవాణి సంఖ్య.. చిరునామా ఇవ్వాలి.
- కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు. జీపీఎస్, సీసీ కెమెరాల నిఘా.. పోర్టు, పోలీసు, జలవనరుల, పర్యాటక శాఖల పర్యవేక్షణ ఉండాలి.
పోశమ్మగండి వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఇటీవల వరద తాకిడికి దాన్ని ఎత్తయిన మరో చోటుకు మార్చారు. ఇక్కడ సీసీ కెమెరాలు, కంప్యూటర్, జీపీఎస్ వ్యవస్థతోపాటు సిబ్బందిని అందుబాటులోకి తేవాల్సి ఉంది.

పూర్తిస్థాయి పర్యవేక్షణ
పాపికొండల విహారం ఈనెల 7నుంచి ప్రారంభం అవుతుంది. ఈలోగా కంట్రోల్ రూమ్‌లు సిద్ధమవుతాయి. భద్రత, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం సాగుతుంది. భోజనం, ఇతర ఏర్పాట్లు సమర్థంగా సాగేలా చూస్తాం. బోట్లలో లైఫ్‌జాకెట్లు, లైఫ్ బాయ్స్, ఇతర భద్రతతోపాటు ఎస్కార్ట్ పర్యవేక్షణ ఉంటుంది. -తోట శ్రీవీరనారాయణ, డివిజనల్ మేనేజర్, పర్యాటక శాఖ, కాకినాడ
ఇదీ చదవండి..
Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం