పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటాలలో నాటుసారాకు వినియోగించే నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబరు ఉన్న వాహనంలో 985 కేజీల బెల్లాన్ని గుర్తించారు.
ఆ వాహనంతో పాటు.. మరో పైలట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. పోలవరంలో బెల్లం విక్రయదారులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని తెలియజేశారు.
ఇదీ చదవండి: