పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో షిరిడి సాయిబాబా ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన పాలకవర్గం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇవీ చదవండి.....