ETV Bharat / state

హైదరాబాద్ ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. సజీవ దహనమైన ఇద్దరు ఏపీ వాసులు - డ్రైవర్ సజీవదహనం

హైదరాబాద్ నగరశివారులోని అప్ప జంక్షన్ సమీపంలో ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఓ కంటైనర్​ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. రాజేంద్రనగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఏపీ‌ వాసులుగా గుర్తించారు.

fire accident
fire accident
author img

By

Published : Apr 15, 2021, 8:29 AM IST

హైదరాబాద్ ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఇద్దరు ఏపీ వాసులు

తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ వద్ద ఓఆర్​ఆర్​పై ప్రమాదం జరిగింది. ఆంధ్రా నుంచి సీఫుడ్​తో వస్తున్న కంటైనర్​(AP39TQ5734)... ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కంటైనర్​ క్యాబిన్​లో మంటలు చెలరేగాయి. తీవ్ర రూపం దాల్చి లారీ పూర్తిగా తగలబడిపోయింది. డోర్లు లాక్​ అవడంతో డ్రైవర్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది.

డ్రైవర్​ ఆర్తనాదాలు విని కొందరు వాహనదారులు అతనిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా అవీ విఫలమయ్యాయి. మంటల్లో చిక్కుకుని వాహనంలోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్యాబిన్​లో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. మృతులు ఏపీ వాసులుగా గుర్తించారు. మంటల్లో డ్రైవర్ సూరజ్, క్లీనర్ మృత్యుంజయ సజీవదహనం అయ్యారు. ఆ వాహనం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ భాస్కర్ తెలిపారు.

ఇదీ చూడండి: అంబేడ్కర్​ జయంత్యుత్సవాల్లో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.