పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన కొల్లి వెంకట్.. వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 2015లో లక్ష్మీ దుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. స్థానిక సీపీఎం కార్యాలయం వీధిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే ఇంటి పక్క వారితో భార్యకు వివాదం తలెత్తడంతో మనస్తాపం చెందిన ఆమె.. 3 నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పక్కింటివారి సూటిపోటి మాటలు వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని వెంకట్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకు పోలీసులు తన ఫిర్యాదు పట్ల స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న భాస్కర్ రావు పేర్కొన్నారు. భార్య చనిపోయిందని మనస్తాపం.. సుమారు ఆరు లక్షల రూపాయల వరకు అప్పులు ఉండడం వల్ల వెంకట్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు భాస్కర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తణుకు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు.
ఇదీ చదవండి : tdp on new districts: 'అమరావతికో న్యాయం.. జిల్లా కేంద్రాలకో న్యాయమా?'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!