పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో దుర్గారావు అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేసి.. మృత దేహాన్ని దూరంగా పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగే సమయంలో గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: