పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలంగాణ మద్యం తరలిస్తున్న పది మందిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2616 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని ఎస్పీ కరీముల్లా షరిఫ్ తెలిపారు. మూడు కార్లను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి :