ETV Bharat / state

YSRCP Leaders Real Estate Business in Government Lands: ప్రభుత్వ స్థలాలతో వైసీపీ నేతల వ్యాపారం.. అక్రమ లేఅవుట్ల వైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

YSRCP Leaders Real Estate Business in Government Lands: అధికారపార్టీ నేతల భూదాహానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జాలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలు, పోరంబోకు భూములు ఇలా దేన్నీ వదలకుండా మింగేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములపైనా రాబందుల్లా వాలిపోతున్నారు. ఎక్కడికక్కడ అనుమతులు లేకుండా అక్రమ లేఔట్లు వేసి విక్రయించడంతోపాటు.. ప్రభుత్వ భూముల్ని సొంత ఆస్తులుగా భావించి పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అండతో రెచ్చిపోతూ, వాటిని లేఅవుట్లలో కలిపేసుకుంటూ స్థిరాస్తి వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతున్నారు.

YSRCP_Leaders_Real_Estate_Business_in_Government_Lands

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 8:10 AM IST

Updated : Sep 3, 2023, 2:30 PM IST

YSRCP Leaders Real Estate Business in Government Lands: ప్రభుత్వ స్థలాలతో వైసీపీ నేతల వ్యాపారం.. అక్రమ లేఅవుట్ల వైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

YSRCP Leaders Real Estate Business in Government Lands : రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ భూములు సైతం లేఔట్లలో కలిసిపోతున్నాయి. తరచూ శాఖల వారీగా సమీక్షలు చేస్తూ అధికారులకు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అక్రమ లేఅవుట్ల నియంత్రణ.. ప్రభుత్వ భూముల పరిరక్షణపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన (YSRCP Leaders Business with Government Places) దాఖలాలు లేవు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్రమంగా సాగుతున్న స్థిరాస్తి వ్యాపారాన్ని అసలు పట్టించుకోవడం లేదు.

Government Lands at Illegal Layouts in AP : ఏ అధికారి అయినా దందాను అడ్డుకోవాలని చూస్తే.. వైసీపీ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు రావడంతో మనకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. వైసీపీ అక్రమాలను పట్టించుకోని అధికారులు.. సాధారణ స్థిరాస్తి వ్యాపారులు వేసే లేఔట్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. లేనిపోని నిబంధనలు పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ వేస్తే నోటీసులిచ్చి హడావుడి చేస్తున్నారు. భారీగా అపరాధ రుసుములు విధిస్తున్నారు. అధికార పార్టీ నేతల అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి చూడని అధికారులు, తమను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని స్థిరాస్తి వ్యాపారులు వాపోతున్నారు.

Layouts Scam: పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్​లు.. అధికార పార్టీ నేతల సహకారంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం

అనుమతులు లేకుండా లేఅవుట్లు : విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఓ వైసీపీ నేత దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఔట్‌ వేస్తున్నారు. ఎకరా జిరాయితీ భూమి కొని పక్కన ఉన్న సర్కారీ భూములను ఆక్రమించి లేఔట్‌ వేశారు. విశాఖ జిల్లా ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిలో గండిగుండం వద్ద వైసీపీ నేత వేసిన లేఔట్‌ కోసం కొండను తవ్వి రోడ్డు వేశారు. ప్రభుత్వ భూమిలోని కొండను అక్రమంగా తవ్వినా.. మట్టిని సైతం ఆ నాయకుడే బాహాటంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ లేఔట్‌కు VMRDA (Visakhapatnam Metropolitan Region Development Authority) అనుమతి కూడా లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో దాదాపు 200 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు (Layouts Without Permissions) లేకుండా లేఅవుట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి అప్పలరాజు అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు.

Illegal Layouts: ఎవడ్రా మనల్ని ఆపేది.. అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్​సీపీ నాయకులు

నెల్లూరు గ్రామీణ మండలంలో అధికార పార్టీ నేతలు.. జలవనరుల శాఖకు చెందిన సుమారు 6 ఎకరాల భూమిని స్వాహా చేసి లేఔట్‌ వేశారు. కోట్ల విలువైన భూముల ఆక్రమణపై హైకోర్టు విచారణకు ఆదేశించినా చర్యల తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పెన్నా పోరంబోకు భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మించి బహిరంగానే విక్రయిస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కడప నగర పరిధిలో ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నేతలు ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారు. వినాయక నగర్‌లో 24 ఎకరాల్లో వేసిన మినిస్టర్ లేఅవుట్లో ప్రభుత్వ భూమి కలిసిందని ఆరోపణలొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు.

Illegal layouts in Nellore: నుడా అనుమతి లేకుండా 100కుపైగా అక్రమ లేఅవుట్లు.. అధికార పార్టీ అండతోనే..!

Last Updated : Sep 3, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.