విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం ఇప్పలవలస గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పొలంలో విద్యుదాఘాతానికి గురై దుడి కిశోర్ అనే యువకుడు మృతి చెందాడు. సాగునీటి మోటర్ ఆన్చేసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీచదవండి