విజయనగరం డీఎన్ఆర్ అమర్ భవన్ లో సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. దయనీయ స్థితిలో నేడు కాలం గడుపుతున్న సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలకి ప్రభుత్వాలు ఆదుకుని న్యాయం చేస్తాయని ఎదురుచూస్తున్నారని పడాల రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటం కోసం 2010 వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించింది. దీని అమలుకోసం రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీలో ఇద్దరు సాక్షర భారత్ సమన్వయకర్తలను నెలకి 2000 వేల రూపాయిలు గౌరవవేతనం ఇచ్చి నియమించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో సుమారు 19 వేల మంది, విజయనగరం జిల్లాలో సుమారు 1800 వందల మంది గ్రామ పంచాయతీ సమన్వయకర్తలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు.
ఆనాటి నుంచి వీధినపడ్డ సమన్వయకర్తలంతా ఏఐటీయూసీ నేతృత్వంలో జిల్లా వ్యాపితంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని అమలు చేసి న్యాయం చేయాలని లేనియెడల ఏఐటీయూసీ నేతృత్వంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి