ETV Bharat / state

ఉమ్మడి విజయనగరంలో తూతుమంత్రంగా ఓటరు జాబితా పరిశీలన - బీఎల్వోలపై ఓటర్లు ఆగ్రహం - Vizianagaram District voter list News

Vizianagaram District People Fire on Voter List Inspectors: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండో రోజుల ఓటరు జాబితా పరిశీలన తూతుమంత్రంగా నిర్వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల బీఎల్వోలు విధులకు హాజరుకాకపోవడం, విధులకు హాజరైన వారు కూడా నామమాత్రంగా ఓటరు జాబితాలను పరిశీలన చేసి, మమ అనిపించేశారంటూ విమర్శిస్తున్నారు. ఇంటి నంబరు సున్నాగా నమోదు కావడం, డబుల్‌ ఎంట్రీ ఓట్లు, మృతుల ఓట్లు కొనసాగుతుండటం వంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

vzm_people_fire_on_voter_list_inspectors

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 4:38 PM IST

ఉమ్మడి విజయనగరంలో తూతుమంత్రంగా ఓటరు జాబితా పరిశీలన-బీఎల్వోలపై ఓటర్లు ఆగ్రహం

Vizianagaram District People Fire on Voter List Inspectors: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓటరు జాబితాల విషయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంటి నెంబరు సున్నాగా నమోదు కావడం, డబుల్‌ ఎంట్రీ ఓట్లు, మృతుల ఓట్లు కొనసాగుతుండడంతో ఆయా జిల్లాల ప్రజలు ఓటరు జాబితా పరిశీలకులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే ఓటరు జాబితాలు తప్పుల తడకలుగా మారుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాల్లో జరుగుతున్న అవకతవకలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్వహించిన రెండో రోజుల ఓటరు జాబితా పరిశీలన తూతుమంత్రంగా నిర్వహించారంటూ అధికారులపై ప్రజలు ఆరోపణలు గుప్పించారు.

Voter List Scrutiny Program Updates: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల సవరణపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నామమాత్రంగా ఓటరు జాబితా పరిశీలన చేసి, మమ అనిపించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ పోలింగ్‌ కేంద్రాలను మార్చాలంటూ ప్రజలు ఫిర్యాదు ఇచ్చినా అధికారులు స్పందించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా తమ సమస్యను ఎందుకు పరిష్కారం కాలేదని ఓటర్లు అధికారులను నిలదీయగా సర్వర్‌ డౌన్ సమస్యలతో పరిష్కారం కాలేదని బీఎల్వోలు సమాధానాలు చెప్తుతున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ జాబితాలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు - బీఎల్వోల పనితీరుపై విమర్శలు

17 Thousand 806 Complaints in Vzm: ఓటరు జాబితాలపై పలువురు అధికారులు మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో విజయనగరం జిల్లా నుంచి 17వేల 806 ఫిర్యాదులు, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 8వేల 428 ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు. అయితే, బూత్‌ లెవల్‌ ఆఫీసర్లుగా అనుభవం లేని గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించడంతో ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం తూతూమంత్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మృతుల ఓట్లే దర్శనమిస్తున్నాయి. చాలా మంది అధికారులు అసలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లలేదు. ఫలితంగా ఓటరు సవరణ జాబితాను రూపొందించడంలో బీఎల్వోలు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Bhogus votes in Bhimili: తప్పుల తడకగా భీమిలి ఓటరు జాబితా.. ఒకే ఇంటి నెంబర్​పై 300 మంది

Vizianagaram Voters Fire on BLVs: ఓటర్ల జాబితా సవరణపై చేపట్టిన బృహత్తర కార్యక్రమంపై అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరోవైపు గతంలో ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై బీఎల్వోలను విపక్ష పార్టీ నేతలు ప్రశ్నించగా ఉన్నతాధికారుల లాగిన్‌కు పంపిచామని, సర్వర్‌ డౌన్‌ సమస్యలతో ఆ తప్పులు పునరావృతం అయ్యాయని బదులిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పనుకువలస, శివరాంపురం, మరపల్లి, గంగన్నదొర వలస పోలింగ్‌ కేంద్రాలకు రెండో రోజు బీఎల్వోలు డుమ్మా కొట్టారు. అనేక పోలింగ్‌ కేంద్రాలు మధ్యాహ్నం వరకు తెరుచుకోలేదు. దీంతో వాలంటీర్లు వచ్చి నామమాత్రంగా దరఖాస్తులు స్వీకరించారని ప్రజలు విమర్శిస్తున్నారు.

పర్చూరులో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు - బీఎల్వోలతో ఎన్నికల సంఘం విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.