ETV Bharat / state

నాడు-నేడు పనులు ఈ నెల 20 లోపు పూర్తిచేయాలి: కలెక్టర్ - విజయనగరం జిల్లా తాజా వార్తలు

విజయనగరం జిల్లాలో జరుగుతున్న మనబడి నాడు-నేడు పనులపై కలెక్టర్​ ఎం.హరిజవహర్​ లాల్ సమీక్షించారు. పురోగతిపై ఆరా తీశారు. ఈ నెల 20వ తేదీ లోపు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతి పరిశీలించాలని సూచించారు. పనుల ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని కోరారు.

hari jawaharlal
hari jawaharlal
author img

By

Published : Oct 11, 2020, 5:25 PM IST

మ‌న‌బ‌డి నాడు-నేడు ప‌నుల‌ను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు. పనులు పూర్తి చేయాల్సిన బాధ్య‌త మండ‌ల ప్ర‌త్యేకాధికారుల‌ు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. నాడు-నేడు ప‌నుల‌పై మండ‌లాల‌వారీగా కలెక్టర్ ఆన్‌లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు తెరిచే సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్ర‌త్యేకాధికారులు నిరంత‌రం మండ‌లాల్లో ప‌ర్య‌టిస్తూ, ప‌నుల‌ పురోగతిపై ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, ఇంజి‌నీరింగ్ అసిస్టెంట్లు, ఏంఈవోలతో స‌మీక్షలు నిర్వహించాలని సూచించారు. త‌క్కువ పనులు జరిగిన చోట క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు. ప‌నుల పురోగతి నివేదిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వ‌శిక్షా అభియాన్ అద‌న‌పు ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్‌కు అంద‌జేయాల‌న్నారు.

నాడు-నేడు కార్య‌క్ర‌మంలో తాగునీటికి సంబంధించి తొలివిడ‌త‌గా మొత్తం 1040 ప‌నులు ప్ర‌తిపాదించ‌గా, 957 ప‌నులు మంజూరు చేసేమని, వీటిలో 953 ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని కలెక్టర్ తెలిపారు. ప్ర‌హ‌రి గోడ‌ల నిర్మాణానికి సంబంధించి మున్సిప‌ల్ ప్రాంతంలో 1040 ప‌నులు ప్ర‌తిపాదించ‌గా, వీటిలో 39 ప‌నుల‌ను మంజూరు చేసి, ప‌నుల‌ను ప్రారంభించామన్నారు. మ‌ర‌మ్మ‌తుల‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1040 ప‌నులు ప్ర‌తిపాదించ‌గా, వీటిలో 1026 ప‌నుల‌ను మంజూరు చేశామ‌ని, 1025 పాఠ‌శాల‌ల్లో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

అలాగే 1040 పాఠ‌శాల‌ల‌కు విద్యుదీక‌ర‌ణ‌, విద్యుత్ మ‌ర‌మ్మతులు ప్ర‌తిపాదించ‌గా, 1039 ప‌నుల‌ను ఆమోదించామ‌ని, 1036 చోట్ల ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. 1040 పాఠ‌శాల‌ల‌కు మ‌రుగుదొడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తుల‌కు ప్ర‌తిపాదించ‌గా, 947 ప‌నులు మంజూరు చేశామ‌ని, వీటిలో 815 చోట్ల ప‌నులు వివిధ స్థాయిలో ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టికీ పనులు ప్రారంభం కానిచోట త‌క్ష‌ణమే ప‌నుల‌ను ప్రారంభించాల‌ని, అన్నింటినీ ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేసేలా యుద్ధప్రాతిప‌దిక‌న ప‌నుల‌ను నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

అమరావతి పోరాటానికి మద్దతుగా రేపు జనసేన నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.