విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామస్థులు ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బోడకొండపై గ్రానైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. తరతరాలుగా కొండను దైవంగా భావించి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.
పర్యావరణానికి విఘాతం కలిగించేలా కొండపై గ్రంధి తవ్వకాలకు అనుమతి ఇవ్వడం అన్యాయమన్న వారు.. తక్షణం తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగారావు గ్రామస్థుల విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: