విజయనగరం పట్టణ తెదేపా అధ్యక్షుడు వీఎస్ ప్రసాద్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైకాపాలోకి చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీఎస్ ప్రసాద్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధితో పాటు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో తమతో కలిసొచ్చే వారిని కలుపుకుపోవాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: