విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో 12 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని.. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి.. రైతులకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జి. వెంకటనాయుడు, పట్టణ అధ్యక్షుడు కోల వెంకట్రావు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బి. సీతారాం దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్