ETV Bharat / state

ప్రయాణం నీటిలో.. ప్రాణాలు అరచేతిలో..

పూర్ణపాడు - లాబేసు.. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఈ పేరు వినని వారు ఉండరు. ఇదేదో పర్యటక ప్రాంతమో.. ప్రత్యేకతల ప్రదేశమో అనుకుంటే పొరపాటే. కేవలం ఇక్కడ ఓ వంతెన నిర్మాణానికి జాప్యమే కారణం. ఎంతో మంది నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పడవలపై రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి. వీరి ప్రయాణం చూస్తే ఇంత సాహసం చేయాలా అనిపించక మానదు. ఇక్కడ వారధి దశాబ్దాల కలగానే మిగిలిపోతోంది.

vijayanagaram-people-facing-problems-due-to-incomplete-bridge-construction
ప్రయాణం నీటిలో.. ప్రాణాలు అరచేతిలో..
author img

By

Published : Oct 29, 2021, 7:05 AM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాగావళి ఆవల ఉన్న కొట్టు, తొడుము, నిమ్మలపాడు, వన్నాం, పాలెం, గుణద తీలేసు, కెమిశిల, మాదలంగి, దళాయిపేట పంచాయతీల పరిధిలోని 33 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోకి రావాలంటే నదిని దాటాల్సిందే. ఇలా ఆగస్టు 30, 1996న నది దాట సేమయంలో పడవ ప్రమాదంలో 33 మంది చనిపోయారు. అప్పుడు పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య వంతెన కట్టాలనే ఆలోచన ఇప్పటికీ నెరవేరడం లేదు.

ఎన్నటికి మోక్షమో..?

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2006లో వంతెన మంజూరు చేశారు. రూ.3.20 కోట్లతో నిర్మాణానికి అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనుల్లో జాప్యం కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనా వ్యయం రూ.9.98 కోట్లకు చేరింది. ఇందులో సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేసి పనులు మధ్యలోనే ఆపేశారు. మిగిలిన మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. తరువాత తిరిగి పనుల పూర్తికి రూ.4 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. గత నెల 9న వెనక్కి వెళ్లిన నిధులతో పాటు రూ.4 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పురోగతి లేదు. నిధులు మంజూరైనా విడుదల కాలేదని స్థానికులు చెబుతున్నారు.

చదువులకు దూరం..: ఇక్కడి విద్యార్థులు వంతెన లేకపోవడంతో చదువులకు దూరమవుతున్నారు. తొమ్మిది ఆపై చదవాలంటే కొమరాడ రావాలి. నదిలో రాకపోకలు ప్రమాదకరం కావడంతో చాలామంది వారి పిల్లలను తొమ్మిదో తరగతి వరకే చదివించి తర్వాత మాన్పించేస్తున్నారు. మాదలంగిలో పదో తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. గుణద తీలేసులో సుమారు పది మంది విద్యార్థులు పదో తరగతితో ఆపేశారు. వసతిగృహాలు ఏర్పాటు చేస్తే పిల్లల్ని చదివించడానికి సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు.

40 కి.మీ.లు అదనపు ప్రయాణం: గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా.. ఎవరైనా ఏదైనా ప్రమాదానికి గురైనా.. పాము కాటు బారిన పడినా.. అనారోగ్యం పాలైనా దేవుడిపై భారం వేయాల్సిందే. అత్యవసర సమయంలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా లేకపోతే మంచంపై పడుకోబెట్టి నలుగురు మోసుకుంటూ నదిని దాటించాలి. లేదంటే కురుపాం మీదుగా ప్రయాణించాల్సిందే. ఇక్కడి ప్రజలు ఐటీడీఏ కేంద్రం ఉన్న పార్వతీపురం చేరుకోవాలంటే కురుపాం మీదుగా సుమారు 60 కి.మీ. ప్రయాణించాలి. వంతెన అందుబాటులోకి వస్తే 40 కి.మీ. వరకూ దూరం తగ్గుతుంది.

త్వరలోనే ప్రారంభిస్తాం..

పనుల్లో జాప్యం వాస్తవమే. గత నెలలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గుత్తేదారుకు బకాయిలు చెల్లిస్తాం. నీటి ప్రవాహ ఉద్ధృతితో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. నవంబరులో పనులు ప్రారంభించి త్వరలోనే వంతెన పూర్తి చేస్తాం.

- ఐ.రమణమోహన్‌, డీఈ, నీటి పారుదల శాఖ.

ఎంతో జాప్యం...

- కె.శ్రీనివాస్‌, అధ్యాపకుడు, కొమరాడ

పనుల కోసం ప్రాణాలు గుప్పిట పెట్టుకొని వస్తున్నాం. వరద ఎప్పుడొస్తుందో తెలియదు. ఒక్కోసారి నది మధ్యలోకి వెళ్లగానే ఉద్ధృతి పెరుగుతుంది. వంతెన అందుబాటులోకి వస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఒడిశా ప్రభుత్వం వనజ, కరడ మధ్య వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేస్తోంది. ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది.

సాహసం చేయాల్సిందే..

- సాత్విక్‌, విద్యార్థి, తులసివలస

వర్షాకాలం వచ్చిందంటే సాహసం చేయాల్సిందే. కళాశాలకు ఉదయం 7 గంటలకు బయలుదేరినా పడవ కదలాలంటే జనం నిండాలి. తరగతులకు ఎన్నోసార్లు ఆలస్యమవుతోంది. చదువుకు ఆటంకం కలుగుతోంది. అనారోగ్య సమస్యలు ఎదురైతే ఆసుపత్రికి వెళ్లడానికి రవాణా సదుపాయం ఉండదు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.

రాలేం.. వెళ్లలేం..

- కౌసల్య, పూర్ణపాడు

14 ఏళ్లుగా చూస్తున్నాం. ఇప్పటివరకు వంతెన పూర్తి చేయలేదు. మా పొలాలు అటువైపు ఉన్నాయి. వెళ్లలేకపోతున్నాం. పత్తి పంట చేతికొస్తోంది. తీయడానికి నది ఆవలి నుంచి కూలీలు రావాలి. ప్రవాహం ఉండటంతో రావడానికి వారు భయపడుతున్నారు. బంధువులను కూడా కలుసుకోలేని పరిస్థితి.

అసంపూర్తిగా మిగిలిన వంతెన నిర్మాణం

ఇదీ చూడండి: AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

For All Latest Updates

TAGGED:

ap top news
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.