విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విశ్రాంత న్యాయమూర్తి ఆదిత్య ప్రతాప్ తన ఇంటి పైకప్పునే సాగుకు అనుకూలంగా మలచుకున్నారు. ఇంటిపైనే రకరకాల పంటలు పండిస్తున్నారు. పూల మొక్కలు, ఔషధ మొక్కలు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
విశ్రాంత న్యాయమూర్తి ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలతోపాటు.. ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కలు, పూల మొక్కలు ఒకటి కాదు రెండు ఏకంగా 50 రకాలు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులతో కాకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు.
ఇంటిపైకి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లగానే అక్కడ పచ్చదనం పలకరిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం హాయినిస్తుంది. మేడపై పండించిన పంటలను స్నేహితులకు పంపిస్తున్నారీయన. ఉద్యోగ విరమణ తరువాత తోట పని చేయటం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారీ విశ్రాంత న్యాయమూర్తి.