ఎంతో కష్టపడి ఒడిశా అధికారుల కళ్లు కప్పి తామంతా ఇంత దూరం వస్తే.. ఆంధ్ర అధికారులు సైతం ఓటు వేయడాన్ని అడ్డుకుంటున్నారని గిరిశిఖర గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు సహకరించాలంటూ.. విజయనగరం జిల్లా పరిధిలో.. ఒడిశా సరిహద్దు గ్రామాల ఓటర్లు ఆందోళనకు దిగారు.
పట్టు చెన్నారు, పగులు చెనారు గ్రామాల గిరిజనులు.. తొణం పోలింగ్ బూత్ ముందు బైటాయించి నిరసన తెలిపారు. అధికారులు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. సరైన గుర్తింపు కార్డులు లేని కారణంగా వారు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు.
ఇవీ చూడండి:
సరిహద్దుల్లో ఓటు వేయకుండా ఆంక్షలు.. పోలీసులకు ఎదురెళ్లి ఓటు వేసిన గిరిజనులు