ETV Bharat / state

సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.. సొంతంగా రోడ్డు నిర్మించారు - సాలూరులో రోడ్డు నిర్మించుకున్న గిరిజనుల వార్తలు

అదొక అటవీప్రాంతం. అక్కడి నుంచి బయట గ్రామాలకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. ఏం జరిగినా, ఏ అవసరం వచ్చి వెళ్లాలన్నా డోలీలే దిక్కు. 2 సంవత్సరాల క్రితం ఒక గర్భిణీని డోలీలో 12 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అయినప్పటికీ గిరిశిఖర గిరిజనుల కష్టాలు తీరలేదు. ఇక లాభం లేదనుకుని తమ గ్రామానికి రోడ్డు వేసుకునేందుకు గిరిపుత్రులే నడుం బిగించారు. ఇంటికి రూ. 2వేలు చొప్పున చందాలు వేసుకుని 4 కి.మీ. రోడ్డు వేసుకున్నారు.

tribals constructed road in saluru mandal vizianagaram district
సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.. సొంతంగా రోడ్డు నిర్మించారు
author img

By

Published : Aug 13, 2020, 2:06 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ అటవీ ప్రాంతం. ఇక్కడ ఉన్న చింతామాల, లద్ద అనే 2 గ్రామాల్లో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు ఒడిశా సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలోని భారీ అనే గ్రామానికి సంతకు వెళ్తుంటారు. అయితే వీరు ప్రయాణం చేసేందుకు సరైన రహదారి మార్గంలేదు. వీరి పరిస్థితిపై కథనాలు వచ్చినప్పటికీ రోడ్డు పడలేదు.

ఇక లాభం లేదనుకుని గిరిపుత్రులే రోడ్డు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. సంతకు వెళ్లే 4 కిలోమీటర్ల వరకైనా రోడ్డు నిర్మించాలని సంకల్పించారు. ఇంటికి రూ. 2వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత సొమ్ము అప్పు తీసుకొచ్చారు. కొండను తొలిచి పనులు మొదలుపెట్టారు. అలా కష్టపడి ఘాట్ రోడ్డును నిర్మించుకున్నారు. మరో వారం రోజులు పనిచేస్తే పూర్తిస్థాయిలో రోడ్డు అందుబాటులోకి వస్తుందని గిరిజనులు చెప్పారు.

ఎవరో వస్తారు... ఏదో చేస్తారు.. అని ఎదురుచూడకుండా తమ సమస్యను తామే పరిష్కారం వెతుక్కున్నారు ఈ గిరిజనం.

ఇవీ చదవండి...

కరోనాతో ప్రముఖ రంగస్థల నటి జమునా రాయలు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.