ETV Bharat / state

పేదల గృహ సముదాయానికి.. పార్టీ జెండా రంగులు!

author img

By

Published : Jan 18, 2021, 10:12 AM IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించిన టిడ్కో గృహాలపై రంగు పడింది. పాత రంగుల స్థానంలో కొత్తవి చేరాయి. విజయనగరం జిల్లా సారిపల్లిలో పేదలకు అందించే టిడ్కో ఇళ్లపై కనిపించిన ఈ వ్యవహారం.. విమర్శలకు తావిస్తోంది.

colour of tidco houses changes
రంగు మారిన టిడ్కో గృహాలు

ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి ట్యాంకులు, జాతీయ నాయకుల విగ్రహాలు.. రాజకీయ పార్టీల జెండాను పోలిన రంగుని పులుముకున్నాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పాటు.. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవటంతో ఆ తంతుకు అడ్డుకట్ట పడింది. తాజాగా... ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన గృహాలకు రంగు మారుతోంది.

విజయనగరం జిల్లా సారిపల్లిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లుకు రంగు మార్చటం ఇందుకు ఉదాహరణ. ఈ గృహ సముదాయానికి గతంలోనే రంగులు వేశారు. తాజాగా మరోసారి రంగులు వేస్తున్నారు. ప్రస్తుతం వేస్తున్న రంగు ఓ పార్టీ జెండా రంగుని పోలి ఉండడం విమర్శలకు తావిస్తోంది. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు సారిపల్లిలో.. 2,656 ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే మిగిలింది. ఈ తరుణంలో రంగు మారటం విశేషం. టిడ్కో డీఈ బాలకృష్ణ వివరణ ఇస్తూ తమ శాఖ ఆదేశాల మేరకు నీలం, క్రీం రంగులు వేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల పథకం.. 24 రోజుల్లో ఇంటి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.