వైకాపాకు ఓటేయలేదనే నెపంతో పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న తనను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ... ఓ మహిళ రిలే నిరహార దీక్షకు దిగింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం పాలవలసలోని పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మిని.. స్కూల్ కమిటీ సభ్యులు తొలగించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న తనను అకారణంగా తీసేయటం సమంజసం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వికలాంగుడు కాగా.. ఇద్దరు పిల్లలున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటంపై.. కుటుంబం మొత్తం రోడ్డున పడిందని తన గోడు వెలిబుచ్చారు.
వైకాపా దిగజారుడు తనానికి ఇదొక నిదర్శనం..
నేటికీ 6 రోజుల నుంచి పాఠశాల ప్రాంగణంలో దీక్ష చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని బాధితులు వాపోయారు. పలు పార్టీ నాయకులు, వికలాంగుల సంఘాలు సైతం వారి దీక్షకు మద్దతు తెలిపాయి. తెదేపా నేత కిమిడి నాగార్జున మహిళకు సంఘీభావం తెలిపారు. వైకాపా దిగజారుడు తనానికి ఇదొక నిదర్శనమన్నారు.
ఇవీ చూడండి: