ETV Bharat / state

Black Magic: చేతబడి నెపంతో మామను హత్య చేసిన అల్లుడు.. రాత్రికి రాత్రే అంత్యక్రియలు - విజయనగరం జిల్లా

చేతబడి చేస్తున్నాడనే నెపంతో వరుసకు అల్లుడైన వ్యక్తే మామను దారుణంగా హత్య చేశాడు. అత్యంత హేయమైన ఈ ఘటన విజయనగరం జిల్లా పనసభద్ర గ్రామంలో జరిగింది.

చేతబడి
చేతబడి
author img

By

Published : Sep 11, 2021, 10:19 PM IST

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన మామను దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేయించారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి.. పంట పొలాల్లో ఉన్న తన భార్య చిలకమ్మకు భోజనం అందించేందుకు వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన కొండతామర నారప్ప( ఉత్తరకు వరుసకు అల్లుడు) కేండ్రుగను వెంబడించాడు. ఉత్తర పారిపోగా..వెంబడించి గ్రామానికి దూరంగా ఉన్న ఓ జీడితోట వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఉత్తర చనిపోయాడు. మరోవైపు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. రాత్రికి రాత్రే.. దహన సంస్కరణలు చేశారు. ఈ విషయం పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నించిన‌ మృతుని కుమారులను గ్రామ పెద్దలు నిలిపివేశారు.

అయితే తన తండ్రిని హత్య చేయడాన్ని జీర్ణించుకోలేని ఉత్తర కుమారులు.. శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ షన్ముకరావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. డీఎస్పీ సుభాష్, సీఐ అప్పలనాయుడు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి: చేతబడి పేరుతో ఊరంతా ఏకమై.. ఏడుగురిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.