ETV Bharat / state

Murder: కుమారుడి వేధింపులు.. తట్టుకోలేక తల్లి ఏం చేసిందంటే..! - విజయనగరం జిల్లా

Mother killed son : మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా.. ఆ అలవాటు మానలేదు. మంచాన సపర్యలు చేయించుకుంటూనే.. ప్రతిరోజు మద్యం, మాంసం కావాలని తల్లి, అక్కను వేధించేవాడు. చివరకు ఆ యువకుడి వేధింపులను తట్టుకోలేక తల్లే.. అతడ్ని హతమార్చింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో చోటు చేసుకుంది.

Mother killed son
Mother killed son
author img

By

Published : Sep 18, 2022, 3:08 PM IST

Mother killed Son : మాతృమూర్తికి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందంటారు. కానీ కన్న కుమారుడి ఆగడాలు భరించలేక, ఓ తల్లికి సహనం చచ్చిపోయింది. ప్రమాదంలో కాళ్లు విరిగి మంచాన పడినా.. తనకు రోజూ మద్యం, మాంసం తేవాలన్న వేధింపులను తట్టుకోలేక ఆ తల్లి.. కుమారుడ్ని చంపేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో జరిగింది.

డెంకాడ మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ భర్త మూడేళ్ల కిందట చనిపోయారు. కుమార్తె సునీత, కుమారుడు సాయితో కలిసి పూసపాటిరేగ మండలం గుండపురెడ్డిపాలెంలో ఉంటున్నారు. స్థానికంగా ఫార్మా కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. అంతకుముందే చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లోనూ మద్యం తాగేవాడు.

రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కను వేధించి కొట్టేవాడు. కుమారుడి ఆగడాలను భరించలేక రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి (20)కి అన్నంలో పురుగుమందు కలిపి వడ్డించారు. అది తిన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లే అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి శనివారం చనిపోయాడు.

ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిని విచారించగా.. వేధింపులు తట్టుకోలేక విసిగిపోయి అన్నంలో పురుగుమందును కలిపినట్లు అంగీకరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.