విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రానికి చెందిన బుడ్డి కిషోర్ (22) సువర్ణ ముఖి నదిలో పడి మృతి చెందాడు. ఉదయం సెలూన్ షాపులో కటింగ్ చేసుకుని స్నానానికి బుడబుక్కల రేవులోకి వెళ్లి ఒడ్డున బట్టలు పెట్టే నదిలో గెంతడం వల్ల రాళ్లు తగిలిపడ్డాడు. కుమారుడు ఎంతసేపటికి రాకపోవటంతో అతని తండ్రి మన్మథరావు నది వైపు వెతుక్కుంటూ వెళ్లాడు. రేవులో కొన ఊపిరితో ఉన్న కుమారుడ్ని ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు మృతుడి తండ్రి తెలిపారు.
ఇదీ చూడండి
ఏలేరు కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం..రక్షించిన స్థానికులు