విజయనగరం జిల్లా పార్వతీపురంలో మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో దళిత నాయకులు నల్ల రిబ్బన్ కళ్లకు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. విశాఖలో వైద్యుడు సుధాకర్ పై దాడిని ఖండిస్తున్నట్లు మాజీఎమ్మెల్యే చిరంజీవులు పేర్కొన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషిచేయాలని సూచించారు. సుధాకర్ పై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి దూసుకొస్తున్న 'ఉమ్ పున్' తుఫాన్- హోంశాఖ హెచ్చరిక