ETV Bharat / state

తుప్పు పడుతున్న పారిశుద్ధ్య యంత్రాలు - విజయనగరం జిల్లా వార్తలు

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో పారిశుద్ధ్యం చేపట్టేందుకు ఆధునాతన యంత్రాలను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లాలో ఈ యంత్రాల లక్ష్యం నెరవేరలేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న ఈ వాహనాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. మురుగు కాల్వల క్లీనింగ్ ట్రాక్టర్లు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఇతర యంత్రాలు ఏడాదిగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా అవుతున్నా... అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

తుప్పల్లో మగ్గుతున్న.. పారిశుద్ధ్య యంత్రాలు

author img

By

Published : Jul 22, 2020, 8:11 PM IST

స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు యంత్రాలను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో మురుగు కాల్వలు శుద్ధి చేసే ట్రాక్టర్లు, చెత్తను తరలించే ఎలక్ట్రికల్ ఆటోలను చెన్నైకి చెందిన ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఈ యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు అందించారు. అలా విజయనగరం జిల్లాకు కొన్ని వాహనాలను కేటాయించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ యంత్రాలను అందించాలని నిర్ణయించారు. కానీ.. అప్పట్లో అది సాధ్యపడలేదు.

కలెక్టర్ బంగ్లాకు కూతవేటు దూరంలోనే...

అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగంపై దృష్టి సారించలేదు. విజయనగరం.. జిల్లా కేంద్రం అంబేడ్కర్ భవనంలోని ఉన్న ఈ వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కలెక్టర్ బంగ్లాకు కూతవేటు దూరంలోని అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో తుప్పలు, డొంకల మధ్య నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేశారు. ఈ ప్రాంగణంలో తొమ్మిది ట్రాక్టర్లు, డ్రైయిన్ క్లీనింగ్ సెట్ లు, 14 ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ తో నడిచే ఈ ఆటోలు ఒక్కోదాని ధర లక్షరూపాయల పైమాటే. సుమారు కోటి రూపాయల విలువ చేసే వాహనాల విషయంలో అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఈ వాహనాలను అర్హులకు అందించాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఇప్పటికే వాహనాల్లో బ్యాటరీలు మాయం అవుతున్నాయని, ఇలానే వదిలేస్తే పనికి రాకుండా పోతాయంటున్నారు.

ఇదీ చదవండి : ఎస్ఈసీపై గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.