కస్టడీలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎస్‌ఐ రవీంద్రరాజు, కానిస్టేబుల్ రఘుపై సస్పెన్షన్ వేటు పడింది. చోరీ కేసులో రాంబాబు అనే వ్యక్తిని ఈనెల 11న అదుపులోకి తీసుకోగా.. ఆయన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఘటనపై మెజిస్టీరియల్, పోలీసుశాఖ విచారణకు ఆదేశించింది. విచారణ తర్వాత ఎస్‌ఐ రవీంద్రరాజు, కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఏం జరిగిందంటే..?
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పీఎస్‌లో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. శాంతినగర్‌కు చెందిన సురేష్ అలియాస్ రాంబాబును ఈనెల 11న చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు రాంబాబు పీఎస్‌లో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎలక్ట్రీషియన్ మృతిపై కలెక్టర్ స్పందించి.. విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి
దివ్యాంగుడిని ఉరేసి చంపేందుకు యత్నించి.. గొర్రెలు అపహరించిన దుండగులు