కష్టపడి పని చేసుకోమని చెప్పిన కన్నతండ్రినే కిరాతకంగా కడతేర్చాడో కుమారుడు. ఈ విషాదకర సంఘటన విజయనగరం జిల్లా పార్వతిపురం పట్టణం ఇందిరా కాలనీలో జరిగింది.
భార్య చనిపోయినా పిల్లలకు తల్లి లేని లేటు లేకుండా చూసుకునే వాడు రాయుపల్లి ఎండయ్య. కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషించుకునేవాడు. మూడేళ్ల క్రితం భార్య చనిపోయినా మరో పెళ్లి చేసుకోలేదు. ఎండయ్య కుమారుడు ఏడో తరగతి వరకు చదివి విద్యకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. అప్పట్నుంచి అల్లరిచిల్లరిగా తిరుగుతూ వ్యవసనాలకు బానిసయ్యాడు. తండ్రిని డబ్బును అడుగుతూ తరచూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణలో ఎండయ్యను కళ్యాణ్ కొట్టటంతో కింద పడిపోయాడు. కింద పడిన ఎండయ్యను తండ్రి అని చూడకుండా పెద్ద రాయితో తలపై మోదాడు. దీంతో ఎండయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న కళ్యాణ్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: చుట్టుముట్టిన కష్టాలు.. మామిడి రైతు కన్నీళ్లు