విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కూడలి వద్ద నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్వతీపురం ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. ప్రభుత్వం అరకు పార్లమెంటు పరిధిలో జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందని వక్తలు తెలిపారు. అరకు కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే పార్వతీపురం ప్రాంతీయులకు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకోవలసి వస్తుందని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాలతో పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు 50 సంస్థలు మద్దతు పలికాయి.
ఇదీ చూడండి : తెదేపా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదు : చినరాజప్ప