విజయనగరం జిల్లా పార్వతీపురంలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారిలో ట్రాక్టర్లపై ర్యాలీగా ఉప కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అన్నదాతలను నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఉప పాలనాధికారికి వినతి పత్రం అందించారు.
ఇదీ చదవండి: 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు