సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ టీ.వీ.కట్టమణి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ లజపతి రాయ్, ఏఓ సూర్యనారాయణ పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ తేజస్వి కట్టిమణిని నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ భరత్ భూషణ్ భగత్ ఆదేశాలు జారీచేశారు. కట్టమణి... కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన విద్యా విధానం పాలసీ కమిటీకి సభ్యులుగా వ్యవహరించారు. సెంట్రల్ యూనివర్సిటీ చట్టం 2009 ప్రకారం 70 ఏళ్ల వయసు మించకుండా ఐదేళ్ల కాలపరిమితిలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: