విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఏనుగులు సంచారంతో జరుగుతున్న పంట నష్టం,ప్రాణ నష్టం నివారణకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల అభయారణ్యం ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ నళినీ మోహన్ వెల్లడించారు. ఇప్పటికే మక్కువ మండలంలోని జంతి కొండ ప్రాంతం అభయారణ్య ఏర్పాటుకు అనుకూలతను పరిశీలించారని వివరించారు. ఒడిశా, ఛత్తీస్ఘఢ్ ప్రాంతాల నుంచి దారి తప్పి వచ్చే ఏనుగులు అభయారణ్యానికి తరలించి స్వేచ్ఛగా జీవించే ఏర్పాట్లు చేయవచ్చని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : పిల్లల భవిష్యత్తేకే కాదు..మొక్కల సంరక్షణకు సైతం