విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం వద్ద ఆబ్కారీ అధికారులు భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి పార్వతీపురం ప్రాంతానికి 980 లీటర్ల నాటుసారా రవాణా చేస్తున్న ఒక బొలెరోతో పాటు ద్విచక్ర వాహనాన్ని, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు పార్వతీపురం సహాయ ఆబ్కారీ సూపరిండెంట్ శ్రీనాథుడు చెప్పారు. రవాణాకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇది చదవండి విశాఖ ఘటన నష్టపరిహారంపై విచారణ వాయిదా