విజయనగరం జిల్లా మక్కువలో పోలీసులు చేసిన తనిఖీల్లో నాటుసారా బయటపడింది. ఓ వాహనంలో 200 లీటర్ల నాటుసారా లభ్యమైంది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సరుకు సీజ్ చేశారు.
సంబరా గ్రామంలో ఓ వ్యక్తి నుంచి 600ప్యాకెట్లు, ఓ మహిళ దగ్గర 300 ప్యాకెట్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నాటుసారా తయారుచేసినా, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: