చీపురుపల్లి నియోజకర్గంలోని గరివిడి పోలీస్ స్టేషన్ నుంచి గరివిడి సినిమా హాల్ వరకూ.. ఆ ప్రాంత పోలీసులు ప్రదర్శన చేశారు. మాస్క్ వేసుకోవటం వల్ల కరోనాకు దూరంగా ఉండవచ్చని అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు.
మాస్క్ లేకుండా రోడ్లపై వచ్చే వారికి వాటిని సీఐ రజులనాయుడు పంచారు. ఇకపై మాస్క్ లేకుండా తిరిగే వారికి పట్టణాల్లో ఐతే రూ.100, గ్రామాల్లో రూ.50, ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. కాబట్టి ప్రతిఒక్కరు మాస్క్ లేకుండా తిరగకూడదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: