విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉదయం 4.30 గంటలకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరరావు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఐదు రోజులుగా ఈశ్వరరావు దీక్ష చేస్తున్నారు. ఆయన్ను పోలీసులు దిక్షా శిబిరం నుంచి తరలించారు. అక్కడ ఉన్న భాజపా కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: