విజయనగరం జిల్లా సాలూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2వేల 800 నాటుసారా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే...
స్పెషల్ బ్రాంచ్ వారు ఇచ్చిన సమాచారం మేరకు సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. సాలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఆటోలో 14 యూరియా బస్తాల్లో రెండు వేల ఎనిమిది వందలు నాటు సారా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మెుత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని...రిమాండ్‌కు తరలించారు. నాటుసారా ప్యాకెట్లు మెుత్తం విలువ 42వేల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన మరో రెండు గంటల్లో బైక్‌తో మూడు ప్లాస్టిక్ క్యాన్ల్తో 60 లీటర్లు నాటుసారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: కలర్ జిరాక్స్‌తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు