విజయనగరం జిల్లా కోడూరులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన భవానీమాత భక్తుడు, జ్యోతిష్యుడైన యజ్జువరపు అప్పలనాయుడు అలియాస్ భవాని ప్రసాద్.. గరివిడి మండలం కోడూరులో తెదేపా బలపర్చిన వ్యక్తి సర్పంచిగా గెలుస్తారని జోస్యం చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా నేత గేదెల ఆదినారాయణ.. తెదేపా గెలుస్తుందని అంటావా అని తనపై వ్యక్తిగత దూషణకు దిగారని.. భవాని ప్రసాద్ బంధువుల వద్ద వాపోయాడు. గెలిచినా, ఓడినా ఎన్నికలయ్యాక అంతు చూస్తామని బెదిరించటంతో.. గరివిడిలో పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన భవాని ప్రసాద్ బంధువుై విశ్వనాథరెడ్డి.. అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవాని ప్రసాద్‌ను తెదేపా నేత కిమిడి నాగార్జున పరామర్శించారు.
ఇదీ చదవండి: మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటం దారుణం: ఊర్మిళ