విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయ వలస గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రెండు వర్గాలకు సంబంధించిన వారెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గ్రామ పెద్దలు మాత్రం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
ఇవీ చూడండి: