ETV Bharat / state

'స్థలం అప్పగిస్తే... రెండేళ్లలో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం'

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని ఏపీ ఎమ్​ఐడీసీ ఈఈ సత్య ప్రభాకర్​ పరిశీలించారు. ఆసుపత్రిలో చేపట్టిన పనులను పరిశీలించిన ఆయన పలు మరమ్మతులకు ఆదేశించారు. ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్థలంలో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ స్థలాన్ని అధికారులకు అప్పగిస్తే ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడతామని స్పష్టం చేశారు.

Breaking News
author img

By

Published : Dec 5, 2020, 1:44 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి ఎదుట గుర్తించిన స్థలాన్ని తమకు అప్పగిస్తే త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఏపీ ఎమ్​ఐడీసీ ఈఈ సత్య ప్రభాకర్ చెప్పారు. ప్రాంతీయ ఆసుపత్రిలో నాబార్డ్​ నిధులు రూ.10.10 కోట్లతో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి వార్డులోని మరుగుదొడ్ల పరిస్థితి బాగాలేదని, వాటికి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత ఆసుపత్రి ఎదురుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. రూ.70 కోట్లతో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామన్నారు. గుర్తించిన స్థలంలో ఏడు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, వాటిని వేరే చోటుకు తరలించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. స్థలం అప్పగించిన రెండేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సిన్.. రాష్ట్రానికి కోటి డోసులు కేటాయించే అవకాశం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.