హరిత రాష్ట్రం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం చుట్టిన పచ్చతోరణం కార్యక్రమం విజయనగరం జిల్లావ్యాప్తంగా ఉత్సహంగా సాగింది. వాడవాడలా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత పెద్దఎత్తున ఈ కార్యక్రంలో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలో కోటీ 23లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లె పచ్చదనంగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలియచేశారు.
జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి విజయనగరం మండలం కొండకరంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, డెంకాడ మండలం అక్కివరం ఆదర్శ పాఠశాలలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మొక్కలు నాటి పచ్చతోరణాన్ని ప్రారంభించారు. తెర్లాంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి, పార్వతీపురం, సీతానగరంలో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సాలూరులో శాసనసభ్యుడు రాజన్నదొర అధికారులతో కలసి జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటారు.
ఇదీ చదవండి జిల్లాలో ఈ నెల 25,26 తేదీల్లో ఇంటింటి సర్వే