ETV Bharat / state

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలకు నూతన హంగులు - ప్రభుత్వ పాఠశాలకు నూతన హంగులు

ఆ బడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందం. చెత్తతో కూడిన పరిసరాలు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు. బీటలు వారిన ప్రహరీ. అస్తవ్యస్థంగా ఉన్న మరుగుదొడ్లు. విద్యార్ధులు తాగునీటికీ కటకటలాడే పరిస్థితి. అభివృద్ధి చేయడానికి అన్ని వనరులు ఉన్నా...దానికి పూనుకునే నాధుడే కరవు. సుశిక్షిత ఉపాధ్యాయ బృందం ఉన్నా...,కనీస సౌకర్యాలు లేకపోవటంతో పిల్లలందరూ ప్రైవేటు బాట. ఇది విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని మురికివాడ గొల్లపేట కుమ్మరివీధికి చెందిన ప్రాథమిక పాఠశాల గత పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాడు-నేడు పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు.

కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలకు నూతన హంగులు

author img

By

Published : Dec 1, 2020, 10:26 PM IST

నాడు - నేడు పథకం కింద నిధులు సమకూర్చటంతో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లపేట కుమ్మరివీధి ప్రాథమిక పాఠశాల దశ తిరిగింది. ప్రభుత్వ నిధులతో పాటు., ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా సదుపాయాలు సమకూరాయి. నగరపాలక సంస్థ పరిధిలో నాడు - నేడు కార్యక్రమం తొలివిడతలో భాగంగా మెుత్తం 14 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 11 ప్రాథమిక పాఠశాలలు కాగా.., మిగిలినవి మూడు ఉన్నత పాఠశాలలు. వీటి మరమ్మతుల కోసం 2.42 కోట్లు వెచ్చించారు.

పచ్చదనం సంతరించుకునే విధంగా పాఠశాల ఆవరణను తీర్చిదిద్దారు. విద్యార్థులందరికీ బల్లలతో పాటు., ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశ్రుభతను అలవర్చే క్రమంలో భాగంగా చేతులు, మధ్యాహ్న భోజన ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో.. తాగడానికి శుద్ధజలాన్ని అందిస్తున్నారు. పాఠశాల మొత్తాన్ని వివిధ రంగులతో ఆకర్షణీయంగా మార్చారు. విద్యాభివృద్ధికి తోడ్పే విధంగా వివిధ రకాల బొమ్మలు, తెలుగు, ఆంగ్ల వర్ణమాలలు, రోజువారి కృత్యాలు, వివిధ వృత్తులు, తెలుగు నెలలు, మాసాలు, పద్యాలు, సామెతలు, కవితలు, సూక్తులు రాయించారు. పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలన్నింటినీ చక్కగా గోడలపై చిత్రీకరించారు. ఈ నూతల హంగులతో పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య 120 నుంచి 200లకు చేరింది.

"పాఠశాలను సర్వాంగ సుదంరంగా తీర్చిదిద్దాం. విద్యార్థి పాఠశాలలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా పాఠశాలలో మార్పులు చేశాం. రూ. 23 లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటింది."

-సురేశ్, గొల్లపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొదించేందుకు కంప్యూటర్ బోధన కోసం ప్రత్యేక గదిని తీర్చిదిద్దారు. ఇందులో దాతల సహాయంతో ఏసీని సైతం ఏర్పాటు చేశారు. పాఠశాలను ఆకర్షణీయంగా..,విజ్ఞాన ప్రపంచంగా తీర్చిదిద్దటంలో ప్రజాప్రతినిధులతో పాటు., స్థానికంగా దాతలు చేయూతనందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సదుపాయాలు సమకూరటంపై ఉపాధ్యాయ బృందంతో పాటు పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"క్లాస్ రూంలు చాలా బాగున్నాయి. ఆడుకోవటానికి ఆటస్థలం, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. పాఠశాల శుభ్రంగా ఉంది. అప్పట్లో బెంచీలు, టేబుల్స్, ఫ్యాన్లు ఉండేవి కావు. ఉక్కతో ఇబ్బంది పడేవాళ్లం. కానీ ఇప్పుడు పాఠశాల వాతవరణం చాలా బాగుంది."

- మామిడి జ్యోతిక

ఇదీచదవండి

ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.