రాష్ట్రంలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్.సీ.డీ.సీ) రూ.100 కోట్ల రుణం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చెరకు రైతులకు చెల్లించాల్సిన పాత బకాయిలు, తీసుకున్న ఆప్కాబ్ రుణం చెల్లించేందుకు ఈ నగదును వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విజయనగరం జిల్లా భీమిసింగ్ షుగర్స్‌కు రూ.12.45 కోట్లు, విశాఖ జిల్లా చోడవరంలోని కర్మాగారానికి రూ.40.28 కోట్లు, ఏటికొప్పాకకు రూ.27.61 కోట్లు, తాండవ షుగర్స్‌కు రూ.19.66 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. నాలుగు చక్కెర కర్మాగారాలు 2018-19 సంవత్సరానికిగాను రైతులకు రూ.48 కోట్ల 70లక్షల నగదు చెల్లించాల్సి ఉంది.
ఇవీ చదవండి..
యూదులపై పగతో హిట్లర్ నాశనమయ్యాడు... మీరూ ఆ తప్పు చేయొద్దు జగన్'