విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పిరిపి గ్రామంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు మెగా పశువైద్య శిబిరం ప్రారంభించారు. గోమాతకు పూజ చేసి అనంతరం శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎంపీ బెల్లాన సందర్శించారు. రైతులు వీటిని ఉపయోగించుకోవాలని.. ఏవైనా సందేహాలుంటే వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పాడి రైతులకు మేలు చేసే సదుద్దేశంతో వైకాపా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు ఏం చేశారు'