Minister Bus Yatra at Vizianagaram: వైకాపా మంత్రుల 'సామాజిక న్యాయభేరి' బస్సుయాత్రలో భాగంగా విజయనగరం న్యూపూర్ణ కూడలిలో జరగాల్సిన బహిరంగ సభ రద్దు అయింది. విజయనగరంలో కురిసిన వర్షం సభను ఆటంకం కలిగించింది. దీంతో మంత్రులు సభను రద్దు చేసి వెనుదిరిగారు.
Samajika Nyaya Bheri Yatra: వైకాపా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని వివరించేందుకు 17 మంది అమాత్యులతో కూడిన బృందం.. సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సుయాత్ర చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు.. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి యాత్ర ప్రారంభించారు. సీఎం జగన్ సామాజిక విప్లవాన్ని సృష్టించారని.. దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
బస్సు యాత్రలో తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని మంత్రులు తెలిపారు. సామాజిక వర్గాలకు చంద్రబాబు మేలు చేయలేదన్న మంత్రులు.. ఆయన్ని పల్లెల్లోకి రానివ్వొద్దంటూ పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా యాత్ర సాగించిన మంత్రులు.. విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ, నాతవలస, డెంకాడలో పర్యటించారు. మంత్రుల బస్సు యాత్ర బహిరంగ సభకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో విజయనగరం న్యూపూర్ణ కూడలిలో నిర్వహించాల్సిన సభను మంత్రుల రద్దు చేశారు.
ఇదీ చదవండి: