ETV Bharat / state

మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది.. "98 డీఎస్సీ" అభ్యర్థులతో మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు! - మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Botsa Satyanarayana: ‘మీకు వయసు పెరిగి పోయింది..45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి..మీరు చదువు చెప్పడం మరిచిపోయారు..ఈ వయసులో  పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయమంతా.. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలిచ్చారు..దానికి ఎవరూ అడ్డుపెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో.. నా బుర్ర పనిచేయడం లేదు..’  డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి.

minister botsa satyanarayana interesting comments
డీఎస్సీ అభ్యర్థులతో మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
author img

By

Published : Jun 30, 2022, 12:28 PM IST

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా గరివిడిలో బుధవారం వైకాపా ఫ్లీనరీ సమావేశం అనంతరం 1998 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కొందరు.. మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మీకు వయసు పెరిగి పోయింది..45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి..మీరు చదువు చెప్పడం మరిచిపోయారు..ఈ వయసులో పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయమంతా.. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలిచ్చారు..దానికి ఎవరూ అడ్డుపెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో.. నా బుర్ర పనిచేయడం లేదు..’ డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి.

డబ్బే గెలిపిస్తే ప్రధానులుగా టాటా బిర్లాలే ఉండేవారు.. ఎన్నికల్లో డబ్బులు పంచడం ద్వారా గెలవచ్చన్న భావన సరికాదని, అలాగైతే టాటా బిర్లాలే ప్రధాన మంత్రులుగా ఉండేవారని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి మనసును గెలుచుకున్న వాడే అసలైన నాయకుడని చెప్పారు. బుధవారం జరిగిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశంలో బొత్స మాట్లాడారు. ఇటీవల చీపురుపల్లి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఆయన సహనం కోల్పోయినట్లు అనిపించిందని విమర్శించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.