ETV Bharat / state

తుపాను ప్రభావంతో విజయనగరం జలమయం - ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు - Michaung Cyclone news

Michaung Cyclone Affected in Vijayanagaram: మిగ్​జాం తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

Michaung_Cyclone_Affected_in_Vijayanagaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:40 PM IST

Michaung Cyclone Affected in Vijayanagaram: మిగ్​జాం తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ల పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయనగర వాసులు
'మిగ్​జాం' ప్రభావంతో విజయవాడ విలవిల - రాకపోకలు బంద్, ఆస్తి నష్టం

Water Entering into Houses due to Storm: విజయనగరం జిల్లా తుపాను ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో భగవాన్ నగర్, నటరాజు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆరు నెలలు క్రితం కురిసిన భారీ వర్షాలు నానా అవస్థలు పడ్డామని స్థానికులు వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేసిన తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపేట-దుప్పాడ రహదారిపైకి వరద నీరు చేరటంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరద నీరు రోడ్లపై చేరడంతో ఎక్కడ గుంత ఉందో తెలియడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

"భారీ వర్షాల కారణంగా కాలువ నీరు కాలనీలోకి చేరింది. బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొొంటుంది.5,10 సార్లు స్పందనలో చెప్పినా ప్రభుత్వాధికారులు స్పందించడం లేదు. కమీషినర్ ,ఎమ్మెల్యే, అధికారులు చెప్పినా తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారు కాని శాశ్వత పరిష్కారం చేయడం లేదు." -స్థానికులు

లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు

Heavy Damage to Farmers Due to Michaung: ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జిల్లాలో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలాలు నీటమునిగడంతో, వరద నీటిని బయటకు పంపేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కోతకోసిన పంట వర్షంలో తడవటంతో ధాన్యం రంగుమారే అవకాశం ఉందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"అకాల వర్షాల వల్ల వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది.పంట మెుత్తం నీటి పాలయ్యింది. ఇప్పటి వరకూ అధికార యంత్రాంగం రాలేదు. ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి" -రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.