విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ ట్రస్టు ఛైర్పర్సన్ సంచైత గజపతిరాజు దర్శించుకున్నారు. తొలిసారిగా అధ్యక్షురాలి హోదాలో అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఏటా మాన్సాస్ ట్రస్టు తరపున ఆ సంస్థ అధ్యక్షులు అమ్మవారిని దర్శించుకుని... పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ట్రస్టు ప్రస్తుత అధ్యక్షురాలు సంచైత.. మేళతాళాలు, పల్లకిలో పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పురోహితులు ఆమెకు వేద మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమె పేరుతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి... తీర్ధప్రసాదాలు అందచేశారు.
ట్రస్టు అధ్యక్షురాలు హోదాలో తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉంది . ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి చల్లని చూపులు, కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని... కొవిడ్ పూర్తిగ తొలిగిపోయి... ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించాను. తప్పకుండా అమ్మవారి దయతో అందరికి ఈ ఏడాది మంచి జరుగుతుందని అభిలషిస్తున్నారు.
_ మాన్సాస్ ట్రస్టు ఛైర్పర్సన్ సంచైత గజపతి
ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మార్ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదనపై అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.
ఇదీ చదవండీ...
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు... విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం