ETV Bharat / state

కబడ్డీ పోటీల్లో విషాదం.. ఆడుతూ యువకుడు మృతి - నేటి తాజా వార్తలు

Young Man Died In Kabaddi Game : విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేళ నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. ఎంతో ఉత్సహంతో ఆటగాళ్లు ఈ పోటీలలో పాల్గొన్నారు. పలు గ్రామల మధ్య నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న యువకుడు గాయపడి ప్రాణాలు కోల్పొయాడు.

Young Man Died In Kabaddi Game
కబడ్డీ ఆడుతూ యువకుడి మృతి
author img

By

Published : Jan 1, 2023, 1:50 PM IST

Young Man Died In Kabaddi Game : విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నూతన సంవత్సర వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అదే స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. కబడ్డీ పోటీలనూ నిర్వహించారు. ఈ పోటీలలో పలు గ్రామాల జట్లు పాల్గొన్నాయి.

ఎరుకొండ-కొవ్వాడ జట్లు రెండు తలపడగా.. ఆటలో ఎరుకొండ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కిందపడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగలటంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతనిని స్థానికులు విశాఖలోని కేజీహెచ్​కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.